Tuesday, August 11, 2026

సమీక్ష సమావేశం

 భద్రాచలం,ఆగస్ట్ 11 : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలపై ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక భద్రాచలం ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీల సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ర్యాలీ, సభ, భోజన సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో చోటుచేసుకున్న చిన్నచిన్న లోపాలను గుర్తించి, వాటిని సవరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆదివాసీల ఆత్మగౌరవ దినోత్సవాన్ని మరింత ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

అదేవిధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు, భద్రాచలం సర్పంచ్ శ్రీ పూనెం కృష్ణ, భద్రాచలం ఐటీడీఏ పీఓ శ్రీ రాహుల్, ఏపీఓ శ్రీ డేవిడ్ రాజ్ లకు, సంబంధిత అధికారులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నవంబర్ 15న బిర్సా ముండా, సోయం గంగులు విగ్రహాల ఏర్పాటు

తదుపరి కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా నిర్వహించడంతో పాటు, భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లో బిర్సా ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆదివాసీ ఐక్య సంఘాల వేదిక ప్రకటించింది.

అదే రోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దమ్మపేట ప్రాంతానికి చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ కోయ బెబ్బులి సోయం గంగులు విగ్రహాన్ని భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లోని ఆదివాసీ యోధుల విగ్రహాల పక్కన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆదివాసీ చరిత్ర, పోరాట యోధుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ తెల్లం రమణయ్య, కో-కన్వీనర్ ముర్ల రమేష్, నాయకులు కుంజా ధర్మా, పూనెం వీరభద్రం, గుండు శరత్, వీసాల కృష్ణయ్య, కొండ్రు వీరస్వామి, నిట్టా రాజు, కుంజా శ్రీను, కుంజా సంతోష్, కోర్సా చినబాబు దొర, చింతా అరుణ, వర్ష వసంత్, వీసాల ఉమాదేవి, కుంజా బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.