Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Monday, October 5, 2026

ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం (లోడ్) పెంచాలి



పురుషోత్తపట్నం గ్రామంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మరియు రైతులకు ఎదురవుతున్న తీవ్ర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ రైతులందరూ కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్  స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ, "మా గ్రామంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం సరిపోక తరచూ లో-వోల్టేజ్ సమస్యలు రావడం, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోవడం మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల మోటార్లు కాలిపోయి, పంటలకు సమయానికి నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు" అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు నష్టం జరగకుండా, తక్షణమే స్పందించి వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని (లోడ్) పెంచేలా సంబంధిత విద్యుత్ శాఖ(ఏపీ ఎంపీడీసీఎల్)  అధికారులను ఆదేశించాలని జిల్లా కలెక్టర్  కోరారు.

రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు, వెంటనే ఈ విషయంపై విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్ అప్‌గ్రేడేషన్/లోడ్ పెంపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పురుషోత్తపట్నం గ్రామ రైతులు, సారెడ్డి ఏడుకొండలు రెడ్డి, సింగిరెడ్డి గోపిరెడ్డి, భోగాల వెంకటరామిరెడ్డి, గొంగడి వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి ఏడుకొండలు రెడ్డి, చేకూరి రామ్మోహన్రావు  వ్యవసాయదారులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పూర్వ ప్రాథమిక తరగతి గదిని ప్రారంభించడం జరిగింది

చర్ల 

 ఈరోజు ఎం.పి.పి.ఎస్.,రైస్ పేట కాలనీ లో  పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతి గదిని, గౌరవనీయులు  మండల విద్యాశాఖ అధికారి  పివి రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ , పి.లలిత కుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,బి. శ్రీనివాస్,ఉపాధ్యాయునులు డి.ధనలక్ష్మి,కే.స్వప్న, పూర్వ ప్రాథమిక తరగతి ఇన్స్ట్రక్టర్,పి.సంగీత, పూర్వ పాఠశాల  ప్రాథమిక తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు,విజయ కాలనీ గ్రామ వార్డు మెంబర్లు, పి.సమ్మక్క , సంతోష్ , పాఠశాల వంట సిబ్బంది,పాఠశాల స్వచ్ఛ మిత్ర మరియు ఆయా, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

ఈ సమావేశమును ఉద్దేశించి,చర్ల. మండల విద్యాశాఖ అధికారి  రైస్ పేట కాలనీ లో, ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన పూర్వ ప్రాథమిక తరగతిలో, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులను, వార్డు మెంబర్లను కోరారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే ఉచిత విద్యతో పాటు,మధ్యాహ్న భోజనం, మరియు ఉచిత ఏకరూప దుస్తులు, టెక్స్ట్ పుస్తకాలు, నోటు పుస్తకాలు,తదితర ప్రోత్సాహకాలను, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వ పాఠశాలలకు తమ తమ పిల్లలను చేర్పించాలని కోరినారు.

 ఏ.ఏ.పీ.సి. చైర్ పర్సన్ శ్రీమతి. పి.లలిత గారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైన వారికి తగిన బహుమతులను అందజేయగలనని ప్రకటించారు. ప్రధానోపాధ్యాయులు, బి. శ్రీనివాస్   మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోగలిగామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరుపేరునా, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ ఆర్చరీ సెలెక్షన్స్ విజయవంతం


ఖమ్మం, అక్టోబర్ 4: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సీనియర్ పురుషులు, మహిళల జిల్లా ఆర్చరీ సెలెక్షన్-కమ్-టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (DYSO) టి. సునీల్ కుమార్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై సెలెక్షన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్చరీ క్రీడాకారులు నిరంతర సాధన, క్రమశిక్షణతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు సాధుల సారంగపాణి, జనరల్ సెక్రటరీ పుట్ట శంకరయ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతులైన ఆర్చర్లను గుర్తించి వారికి ఉన్నత స్థాయి పోటీల్లో అవకాశాలు కల్పించడమే ఈ సెలెక్షన్స్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు 11-10-2026న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ & సెలెక్షన్ ట్రయల్స్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.

ఎంపికైన క్రీడాకారులు

కాంపౌండ్ – పురుషులు:

1. కె. పృథ్వి – తండ్రి: వెంకన్న

2. ఎ. కొండలరావు – తండ్రి: శ్రీను

3. పి. మేఘాంశ్ – తండ్రి: కిషోర్ కుమార్

4. డి. శ్రీ గర్విత్ – తండ్రి: రాంబాబు

5. ఎన్. సంజయ్ కుమార్ – తండ్రి: రామకృష్ణ

6. డి. దిలీప్ కుమార్ – తండ్రి: రమేష్

రికర్వ్ – పురుషులు:

1. కె. అశ్విత్ దొర – తండ్రి: వెంకట నారాయణ

2. ఇ. ఆనంద్ – తండ్రి: వెంకటేష్

3. వి. వంశీ – తండ్రి: వెంకటేశ్వర్లు

4. కె. సాయి నిఖిల్ – తండ్రి: సత్య రామకృష్ణ

5. ఎం. సిద్ధు – తండ్రి: సలేందర్


రికర్వ్ – మహిళలు:

1. కె. లోహిత శ్రీ – తండ్రి: సతీష్ కుమార్

2. బి. ఝాన్సిక – తండ్రి: కృష్ణారావు

3. సిహెచ్. ఔచిత్య – తండ్రి: రఘునాథరావు

4. ఎస్. జెస్సిక – తండ్రి: వినోద్ కుమార్

5. కె. లావణ్య – తండ్రి: మల్లేష్


ఇండియన్ రౌండ్ – పురుషులు:

1. కె. లక్ష్మణ్ – తండ్రి: వెంకన్న

2. కె. సర్వేష్ – తండ్రి: బోతయ్య

3. కె. రామ్ చరణ్ – తండ్రి: ముత్తయ్య

4. ఆర్. భార్గవ్ – తండ్రి: నాగేష్

5. బి. అనిల్ – తండ్రి: అబయ్య

6. ఎం. చరణ్ – తండ్రి: భబ్రయ్య


ఇండియన్ రౌండ్ – మహిళలు:

1. ఎం. జెనిషా – తండ్రి: నాగేంద్రబాబు

2. కె. జ్యోష్న – తండ్రి: సుకేందర్ రావు

3. పి. మానస – తండ్రి: వెంకటేశ్వర్లు

4. ఇ. అవంతిక – తండ్రి: గాంధీ

5. బి. సంజన శ్రీ – తండ్రి: రామకృష్ణ

6. పి. వర్షిత – తండ్రి: కృష్ణ

ఈ కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



Sunday, October 4, 2026

నిపుణులతో సమాలోచన


 స్థానిక సరస్వతి శిశు మందిర్ లో విద్యాబోధన మరింత వైజ్ఞానికంగా,విలువలతో కూడిన విద్య ని పిల్లలకి అందించడం కోసం నిపుణులైన విశ్రాంత ఉపాధ్యాయులతో ఇంకా ఇతర నిపుణులతో సమాలోచన జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం లో పలువురు నిపుణులైన ఉపాధ్యాయులు పాఠశాల లో ఉన్న విద్యార్థులతో ముచ్చటించి వారి అవసరాల్ని తెలుసుకున్నారు.అలాగే బోధనా సిబ్బంది కి కూడా పలు సూచనలు ఇచ్చి తమ సహాయ సహకారాల్ని అందించడానికి సుముఖత వ్యక్తపరిచారు.



  •  ప్రతి సబ్జక్ట్ కి సంభందించి వాటి లోతుపాతులను, ప్రిపేర్ అయ్యే విధానాల్ని తెలియబరిచారు. స్థానిక ఉప ఖజనాధికారి తెల్లం సుభద్ర ఇ కార్యక్రమం లో ఫాల్గొన్న వారిని అందర్నీ అభినందించారు. తమ ఖాళీ సమయం లో విద్యార్థులకి,బోధనా సిబ్బందికి తమ అమూల్యమైన సేవల్ని అందించడానికి ముందుకువచ్చిన వారందరికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత ధన్యవాదాలు తెలిపారు. జి.భూషణ రావు,జి.తులసీ దాస్,జి.వి.సత్యనారాయణ,విజయలక్ష్మి,అనసూయ,రఘురాం ప్రసాద్,జి.రమణ,బందు వెంకటేశ్వర రావు,సుబ్బయ్య చౌదరి,బాలాజీ రాజు,కెవివిఎస్ మూర్తి, ఝాన్సీ రాణి తదితరులు ఫాల్గొన్నారు.


Wednesday, September 30, 2026

బెక్కంటి ఎక్కడ ఉంటే ఆ పాఠశాలకి అభివృద్ధి సుగమం

మారుమూల ప్రాంతం నుండి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకొని ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును  ఉన్నత శిఖరాలలో ఉండే విధంగా  అద్భుతంగా  తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి బెక్కంటి శ్రీనివాసరావు అని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావ్  కొనియాడినారు.

 బుధవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురంలో జరిగిన ప్రధానోపాధ్యాయిని పదవీ విరమణ వీడ్కోలు సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి  శంభు ప్రసాద్ హాజరై బెక్కంటికి ఘన సన్మానం నిర్వహించారు.

 ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ  బెక్కంటి శ్రీనివాసరావు  పనిపట్ల కలిగిన అంకితభావము, క్రమశిక్షణ, ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనాన్ని పెంచాయని అభినందించారు. 

 చర్ల,  పినపాక, అశ్వాపురం, ములకలపల్లి MEO లు మాట్లాడుతూ స్టేట్ రిసోర్స్ గ్రూప్ పర్సన్ గా, గణిత  ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయులుగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న బెక్కంటి గారు రెండు నెలలు ఎంఈఓ పనిని  తన వాగ్దాటితో, లౌక్యంతో, పట్టుదలతో పరిపాలన చేశారని  తను అనుకున్న పనిని నెరవేర్చేదాక నిద్రపోని గొప్ప వ్యక్తి  బెక్కంటి  అని తన వ్యక్తిగత పనుల కంటే తన పాఠశాల పనులకు, విద్యా వ్యాప్తికి గిరిజన ప్రాంతంలో గణనీయమైన కృషి చేశారని   పాఠశాలకి కావలసిన మౌలిక వసతులు ఏమైనా సమకూర్చాలంటే బెక్కంటి శ్రీనివాసరావుకు  మరి ఎవరు సరిలేరని బెక్కంటి గారి సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో జగదీష్ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్  UPS జగదీష్ కాలనీ పాఠశాల మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారిగా  పాఠశాలల యొక్క పనితీరు మెరుగుపరచడంలోనూ, వికలాంగుల దినోత్సవం నిర్వహణలోనూ, మండల స్థాయి గేమ్స్ నిర్వహణలోనూ, మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను సమన్వయం చేయడంలోనూ మంచి అధికారిగా సమన్వయకర్తగా సేవలు అందించారని భద్రాచలం మండలాన్ని జిల్లాలోనే ఉన్నత స్థితిలో ఉంచడానికి వారు చేసిన కృషిని ప్రశంసించారు.

 కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ దశం బాబు మాట్లాడుతూ ఈరోజు మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను ఉత్సాహపరుస్తూ  ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ఉన్నాయని పత్రిక మాధ్యమం ద్వారా కాంప్లెక్స్ ను మరియు దుమ్ముగూడెం మండలాన్ని అగ్రగామిలో ఉంచడానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయునిగా బె క్కంటి  సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 

 పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ మాట్లాడుతూ ప్రతి నెలలో కనీసం  20 పాఠశాలలు సందర్శిస్తూ  పాఠశాలలో ఉన్నటువంటి ఔత్సాహిక  విషయాలను  గుర్తించి ఉపాధ్యాయులను ప్రోత్సహించి పాఠశాలలు ఏ విధంగా ఉండాలని తెలియజేసిన గొప్ప వ్యక్తి అని కొని యాడినారు.

 నర్సాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులైన అనిల్ సార్ మాట్లాడుతూ బెక్కంటి  గత మూడు సంవత్సరాలుగా మా పాఠశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పాఠశాలకి కావలసిన మౌలిక వసతులైనటువంటి గ్రౌండ్, శానిటేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ విద్యార్థులకు ఏర్పాటు చేయడంలో ప్రధానోపాధ్యాయుల కృషి మరువలేనిదని కొనియాడారు. గత రెండు సంవత్సరాలుగా 100% పదో తరగతిలో రిజల్ట్ పాఠశాలకు తీసుకురావడంలో  మారుమూల ప్రాంతంలోనైనా విద్యార్థులకు కలెక్టర్ గారి చేతుల మీదగా సైకిళ్లు  ఇప్పించడం ద్వారా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలైన ల్యాబ్,గ్రౌండ్ అనేక కనీస అవసరాలు సమకూరుస్తూ, ఉపాధ్యాయులకు ఎంతో చేదోడు, వాదుడుగా ముందుకు తీసుకెళ్లిన సార్ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే చాలా బాధగా ఉంది అని పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా తమ మాటల్లో తెలియపరచడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, పినపాక మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, అశ్వాపురం మండల విద్యాశాఖ అధికారి వీరాస్వామి, చర్ల మండల విద్యాశాఖ అధికారి రమణ, ములకలపల్లి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి గార్ల చేతుల మీదుగా 

బెక్కంటి శ్రీనివాస్  ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 

బెక్కంటి శ్రీనివాస్ రావు  తన చిన్ననాటి ఏడవ తరగతి గురువుగారికి సాష్టాంగ ప్రణామములు  చేసి వారిని సన్మానం చేయడం సభికులను ఆనందపరిచింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 

బెక్కంటి  శ్రీనివాస్ రావు  తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు తనను ఒక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్థానాన్ని కల్పించిన ఈ మన్యం ప్రాంతానికి రుణపడి ఉంటానని తన జీవితంలో విద్యావ్యాప్తికి తను చేసే ప్రతి పనిలో సహకరించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ లోని అనేక మంది ఉపాధ్యాయులు గ్రామస్తులు పలు రాజకీయ పార్టీ నాయకులు మరియు అన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొని బెక్కంటి  సేవలను కొనియాడారు. ఘనంగా నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.

Tuesday, September 29, 2026

శ్రీరాముడిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భద్రాచలంలో బీజేపీ ఆందోళన


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల ఆరాధ్య దైవం, ప్రపంచానికి ఆదర్శ పురుషుడైన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

శ్రీరాముడిని ధనికుల దేవుడిగా, పరమశివుడిని పేదల దేవుడిగా అభివర్ణించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దేవుళ్లను ఆర్థిక వర్గాల పేరుతో విభజించి మాట్లాడటం సరికాదని అన్నారు.

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచల శ్రీరామచంద్రస్వామి కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, హిందువులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు

Monday, September 28, 2026

మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి సేవలు అభినందనీయం

మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు అందించిన సేవలు అభినందనీయమని పలువురు విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొనియాడారు. ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్న సందర్భంగా భద్రాచలం మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జి. జాన్సన్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు చక్కటి పరిపాలన అందించారని, విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.

మాజీ మండల విద్యాశాఖ అధికారి టి. రమ మాట్లాడుతూ బెక్కంటి శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా మండలంలో కేవలం రెండు నెలల వ్యవధిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ (FLN) కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో ఆయన చేసిన కృషి అమోఘమని ప్రశంసించారు. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పెంపొందించే కార్యక్రమాల అమలులో ఆయన చొరవ అభినందనీయమని తెలిపారు.


ఈ సందర్భంగా బెక్కంటి శ్రీనివాసరావును శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కుర్రాజులగుట్ట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. రమ, యూపీఎస్ జగదీష్ కాలనీ ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్, వివిధ ఉపాధ్యాయ సంఘాల ముఖ్య నాయకులు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.`


Saturday, September 26, 2026

వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధుల మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం  టి.ఎస్.జి.ఆర్.ఈ.ఏ. ఉద్యోగుల విశ్రాంతి భవనం నందు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా DHEW DMC . సంతోష రూప మాట్లాడుతూ కుటుంబాల్లోని వృద్ధులను గౌరవంగా చూసుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకుండా ప్రేమాభిమానాలతో ఆదరించాలని సూచించారు. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

వృద్ధులకు ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 14567కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వృద్ధుల హక్కులు, సంక్షేమం, భద్రతపై కుటుంబ సభ్యులు మరియు సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. వయోవృద్దుల సమ్రక్షణకి సంబందించిన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఆ తరువాత టి.ఎస్.జి.ఆర్.ఈ.ఏ. కార్యాలయం లో పేద ప్రజలకి అన్నదానం చేయడం జరిగింది.లోకల్ హాబిటాట్ ఫర్ హ్యూమానిటి సంస్థ వారు దీనికి సహకరించారు. అధ్యక్షులు జి.భూషణ రావు,జాయింట్ సెక్రటరి జి.వి.సత్యనారాయణ,ఉపాధ్యక్షులు వై.రామచంద్ర రావు, రాజేశ్వర రావు తదితరులు ఫాల్గొన్నారు. 

Wednesday, September 16, 2026

19 తేదీ వరకు మా ఎన్రోల్మెంట్ 30 చేసి చూపిస్తాం...

 తాత గుడి సెంటర్ నూతనంగా ప్రారంభించిన 'ప్రీ ప్రైమరీ" కేంద్రంలో శనివారం సాయంత్రం వరకు విద్యార్థుల సంఖ్య 30కి పెంచి చూపిస్తామని తల్లిదండ్రులు ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష మండల విద్యాశాఖ అధికారి కిహామీ ఇచ్చారు.

 బుధవారం నాడు భద్రాచలం సర్పంచ్ పూనెం. కృష్ణ మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు ఆ పాఠశాలలో సందర్శించి ప్రభుత్వం నుండి వచ్చిన పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు,బెల్ట్,టై, పుస్తకాలను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయంలో పలు ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని కాబట్టి గ్రామస్తులందరూ ప్రభుత్వం అన్ని రకాల వసతులతో ఉచిత విద్యను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది కాబట్టి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి కృష్ణ తోపాటు మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జాన్సన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాపయ్య, ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయిని శిరీష, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

Tuesday, September 15, 2026

భద్రాచలానికి మూడో వంతెన: కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

 

భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్‌ను కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్‌ను మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ ప్రాజెక్టులో భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం  జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు.

ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు. 

Friday, September 11, 2026

ఈ నెల 17 న తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని జరపాలి

 

 శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు మండల నాయకులు  ఈనెల సెప్టెంబర్ 17 వ తారీకు నాడు కోరినారు.తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని, అదేవిధంగా భద్రాచలంమండల కేంద్రంలో అధికారికంగా జరపాలని భద్రాచలం మండల MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 వ తారీకు నాడు నిజాం రాజుల నిరంకుశ పాలనను అంతం చేసి అనేక పోరాటాల వల్ల, ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది, కాబట్టిఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అధికారికంగా జరుపుకోవాలని కోరినారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజాధర్మ . జిల్లా కార్యవర్గ సభ్యులు ములిశెట్టి రామ్మోహన్ రావు, జిల్లా నాయకులు నిడదవోలు నాగబాబు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, ఓబీసీ జిల్లా నాయకులు గుమ్మాల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు , మండల ప్రధాన కార్యదర్శులు ముత్యాల చంద్రశేఖర్,  చెల్లిబోయిన వెంకన్న మండల ఉపాధ్యక్షులు షేర్ శ్రీనివాస్, గంగులకుర్తీ రామాచారి, యువ మోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, ఓబిసి మండల ప్రధాన కార్యదర్శి. జంపాల ప్రభాకర్ తదితరులు ఫాల్గొన్నారు.  


 

సుభాష్ నగర్ వాసుల 'ఆశాజ్యోతి' ఎయిడెడ్ స్కూల్

 భద్రాచలం సుభాష్ నగర్ కాలనీలో పనిచేస్తున్న *గోపాలకృష్ణ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల స్కూల్ గ్రామస్తుల ఆశాజ్యోతి* గా నిలుస్తుందని భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ *పూనెం.కృష్ణ* అభిప్రాయం వ్యక్తం చేశారు.

  బలహీన బడుగు వర్గాలకు అభ్యున్నతి కోసం మూడు దశాబ్దాల కాలము నుండి అంకితభావంతో సుభాష్ నగర్ లో *ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఆశాదీపంగా పనిచేస్తుందని వార్డు నెంబర్ గోపి* తెలిపారు.

 ఈ పాఠశాలల *1995 ఒక చిన్న గుడిసెలో* ప్రారంభమైన ఈ పాఠశాల 2022 లో జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది అనంతరం 2023 సంవత్సరము లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఆ *పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయగా అవార్డు స్వీకరించటం ఆమె కృషికి నిదర్శనమని* వార్డు మెంబర్ గోపి హర్షద్వనాల మధ్య ప్రధానోపాధ్యాయుని కృషిని అభినందించారు.

ప్రస్తుతం ఈ పాఠశాలలో చదివే *ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారని* ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని *వేంపాటి ఉషారాణి చెప్పటంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో ఆనందం* వ్యక్తం చేశారు.

*1996 గోదావరి వరదల్లో పాఠశాల మొత్తం శిధిలావస్థకు* చేరి కింద పడిపోవటంతో దిక్కుతోచని స్థితిలో *ఆ కాలనీవాసులు నానాజీ వారిని ఒప్పించి మెప్పించి తాత్కాలిక రేకుల* షెడ్డు నిర్మించి 2020 అదే షెడ్లో పాఠశాలను నిర్వహించారు.

 అనంతరం పలుమార్లు వరదల్లో రేకుల షెడ్డు కూడా ప్రమాదంగా మారటంతో ఎప్పుడు షెడ్డుపడి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందో అని ముందస్తు జాగ్రత్తతో ప్రధానోపాధ్యాయిని *ఐటిసి పేపర్ బోర్డ్ సారపాక వారి సహాయం కోసం పలుమార్లు అభ్యర్థన* చేయటంతో కంపెనీ ప్రతినిధులు సర్వే నిర్వహించి పాఠశాల అవసరాన్ని గుర్తించి *2022 కరస్పాండెంట్, ప్రధాన ఉపాధ్యాయుని సమన్వయంతో పాఠశాల భవన నిర్మాణానికి 20% ఆర్థిక సహాయాన్ని ఐ టి సి కంపెనీకి అందించి నూతన పక్క భవనాన్ని నిర్మించి* పాఠశాల ప్రాంగణం చుట్టూ ప్రహరి గోడ నిర్మాణంతో *జిల్లాలోనే ఒక మోడల్ స్కూల్ మైమరిపించే విధంగా పాఠశాల పనిచేస్తున్నట్లు గ్రామస్తులు నూకా రత్నం* తెలిపారు.

 ప్రస్తుతం ఈ పాఠశాల పక్కా భవనం *పిల్లలందరికీ పక్కా రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్లు,వాష్ బేసిన్* అన్ని రకాల వసతులు ఈ పాఠశాల సొంతం అని వారు అభిప్రాయం తెలియజేశారు.

  *గ్రీన్ భద్రాద్రి వారి సహాయ సహకారాలతో పాఠశాల ప్రాంగణం మొత్తం పెద్దపెద్ద వృక్షాలతో పచ్చని వాతావరణానికి ఈ పాఠశాల కేరాఫ్ అడ్రస్* గా మారింది అని చెప్పక తప్పదు.

 ఈ నేపథ్యంలో ఈ పాఠశాలలో *ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీష్,గణితం అంశాలలో కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించి మౌఖికంగా ఏ లెక్కల అడిగినా టక టక చెప్పి అందర్నీ అబ్బురపరచటం గమనార్హం* అని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 అనంతరం *గ్రామ సర్పంచ్ చేతులమీదుగా విద్యార్థులందరికీ నూతన ఏకరూప దుస్తులు* అందించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అందరి సమక్షంలో ప్రధానోపాధ్యాయని, మండల విద్యాశాఖ అధికారి *పాఠశాలకు విచ్చేసిన గ్రామ సర్పంచ్ పూనెం. కృష్ణను ఘనంగా శాలువాతో సత్కరించారు.*

ఈ కార్యక్రమంలో గ్రామ *సర్పంచ్ పూనెం.కృష్ణ, వార్డు నెంబర్ కావూరి.గోపి,మండల ఏపిఎం, టైలర్ దాసు, పాఠశాల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ, ఎండిఎం నిర్వాహకురాలు నూకరత్నం* తదితరులు పాల్గొన్నారు.


Thursday, September 10, 2026

పూల బొకే ఇచ్చి ఆశీర్వదించారు.

గాదె మాధవ రెడ్డి అస్వస్థకు గురై హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో వైద్య సేవలు తీసుకొని భద్రాచలం వచ్చిన సందర్భంగా ఎందరో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు అలాగే కళాకారులు. ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు, చాలామంది పరామర్శించి ,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈరోజు కళాబంధు మేము సైతం కళా సేవలో తెలంగాణ సేవా సంస్థ సభ్యులు బెల్లంకొండ దుర్గా కోమలి, మరిగంటి పద్మావతి, కత్తి కనకదుర్గ , జెమిని రామలక్ష్మి, కోట దుర్గాప్రసాద్ అందరికన్నా భిన్నంగా గాదె మాధవరెడ్డి  స్వగృహానికి చేరుకొని వారి యొక్క కవిత్వంతో.. పాటలతో.. అలరించి ఎంతో ప్రేమతో త్వరగా కోలుకోవాలని పూల బొకే ఇచ్చి ఆశీర్వదించారు.

సాయి బాబా స్వర్ణ సింహాసనానికి లక్ష విరాళం

భద్రాచల వాసి ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు భద్రాచలం గ్రామాన్ని హరిత భద్రాద్రి గా తీర్చి దిద్దాలని గత 15 స. లు గా వారి బృందం తో కలసి తీవ్రం గా కృషిచేస్తున్న ''వృక్ష మిత్ర '' రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహిత లయన్ డా. గోళ్ళ భూపతి రావు కు ఎన్నో ప్రశంసలు. భద్రాచలం గ్రామం పచ్చదనం తో ఉంది అంటే అత ని పట్టుదల అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

 అంతే కాకుండా స్వయం గా దానగు ణం గల వీరు ఎన్నో సేవ కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా సహయం చేయటం, మొక్కలు పంచడం వీరికి అలవాటు. భద్రాచలం లో ఉన్న దేవాలయాలకు వారి కుమారుడు డాక్టర్ గోళ్ళ వరుణ్ కుమార్ ఎమ్ ,డి , యు. ఎస్. ఏ., వారు కూడా విరాళాలు అందచేశారు. వీరి చిన్నతనం లో స్థాపించిన సాయిబాబా ఆలయం వారికి స్వర్ణ సింహాసనం తయారు నిమిత్తం గోళ్ళ భూపతి రావు, మంజుల రాణి దంపతులు ఒక లక్ష విరాళం అందచేశారు. 

ఈ సందర్బంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ప్రతి వారు వారి జీవితం లో కొంత భాగం పేదవారికి సహాయం చేయడం అలవాటుగా నేర్చుకోవాలని ఇతరులకు ఆదర్శం గా నిలవాలని తెలియ చేసారు. అదేవిధంగా నా ఈ సమాజ సేవ కార్యక్ర మాలను కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటానని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ,శ్రీ చా రుగుళ్ల సుబ్బా రావు కోశాధికారి వెంకటేశ్వర రావు, శ్రీ కడలి నాగరాజు మరియు ఆలయ అర్చకులు శ్రీ రామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు


విద్యార్థుల ధ్రువపత్రాల జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలి


ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పీజీ ప్రవేశాల ప్రక్రియలు కొనసాగుతున్న వేళ విద్యార్థులకు అవసరమైన కుల, సమగ్ర, ఆదాయ, నివాస ధ్రువపత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ భద్రాచలం బీజేపీ ఎస్టీ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో భద్రాచలం తహసీల్దార్ వై. రవికుమార్కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా *బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్* మాట్లాడుతూ, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత సిబ్బంది పరిశీలన, ఆర్‌ఐ ధృవీకరణ, తహసీల్దార్ స్థాయి ఆమోదం వంటి వివిధ దశల్లో సమన్వయం లోపించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఉద్యోగ, విద్యా ప్రవేశాల గడువులు సమీపిస్తున్న నేపథ్యంలో *పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేకంగా సమీక్షించి, అత్యవసర దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని* కోరారు. అలాగే విద్యార్థులు తమ ధ్రువపత్రాల దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా, *ఉద్యోగం లేదా విద్యా ప్రవేశానికి గడువు ఉన్న విద్యార్థులు* తమ పెండింగ్ ధ్రువపత్రాల వివరాలను బీజేపీ సహాయ కేంద్రానికి పంపితే, వారి దరఖాస్తు స్థితిని సంబంధిత అధికారుల వద్ద తెలుసుకుని, అవసరమైన మేరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫాలోఅప్ చేస్తామని కుంజా సంతోష్ తెలిపారు.

📱 *వాట్సాప్ సహాయ కేంద్రం: 9866060034*

విద్యార్థులు మీ సేవ దరఖాస్తు సంఖ్య, ధ్రువపత్రం పేరు, దరఖాస్తు తేదీ, ఉద్యోగం/ప్రవేశానికి సంబంధించిన గడువు వివరాలను పై నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, అన్నెం సాయి లక్ష్మణ్, కిలారు అంజి, గంగులకుర్తి రామాచారి తదితరులు పాల్గొన్నారు. 

 

Tuesday, September 8, 2026

అక్రమ అరెస్ట్ ను ఖండించండి

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్సి తాతమధు అక్రమంగా అరెస్టును చర్ల మండల బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హమీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రజలకు కోసం ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ చూడ లేక ఓర్వ లేక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఎల్సిలను అసెంబ్లీలోకి వెళ్ళనీయకుండా పోలీసులతో కొట్టించడం, కింద పడేసి తొక్కడం మహిళ ఎంఎల్ఏలు అని చూడకుండా మెడ పట్టుకుని తోయడం చీరలు లాగి అవమానించడం చరిత్రలో ఎప్పుడు జరగని ఈ చర్యను చూసి తాతమధు  చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ప్రజా సమస్యలకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాతమధు  ఆ సందర్భంలో అన్న మాటలు గౌరవనీయులైన స్పీకర్ గారికి బాధ కలిగించినటైతె తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నాను అని పత్రిక ముఖం తెలియజేసిన అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులైన మహిళలకే రక్షణ లేక పోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం నిన్న మహిళ ఎంఎల్ఏలకు జరిగిన అవమానం తెలంగాణ రాష్ట్ర మహిళలందరికి జరిగిన అవమానం కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ విద్యార్థికి అండగా నిలిచిన భద్రాచలం – MBBS చదువుకు ₹1.20 లక్షల ఆర్థిక సహాయం

 

ములకలపల్లి మండలం, సీతాయిగూడెం గ్రామానికి చెందిన *కోయ ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్* తల్లిదండ్రులు లేకపోయినా, తన కష్టంతో చదువుకుని *NEETలో 424 మార్కులు సాధించి MBBS సీటు* సాధించాడు.

ప్రస్తుతం *Arundathi Institute of Medical Sciences*లో తనకు కేటాయించిన MBBS సీటును కొనసాగించేందుకు *08-09-2026 (మంగళవారం)లోపు ₹1,20,000/-* ఫీజు చెల్లించాల్సి ఉంది.

ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న *భద్రాచలం ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ బి. రాహుల్ గారు* స్పందించి, నక్క సంతోష్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని *ITDA ద్వారా ₹60,000/- ఆర్థిక సహాయం* అందించారు.

ఈ సందర్భంగా త్వరితగతిన స్పందించి ఆదివాసీ విద్యార్థికి అండగా నిలిచిన *ITDA PO శ్రీ బి. రాహుల్ గారికి ఆదివాసీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.*

🔥🔥 *కేవలం ఒక గంటలోనే ₹60,116/- సమీకరణ!* 🔥🔥

ITDA ద్వారా అందిన ₹60,000/-కు అదనంగా అవసరమైన మిగిలిన మొత్తాన్ని సమీకరించేందుకు ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు, దాతలు ముందుకు వచ్చారు.

*కేవలం ఒక గంట సమయంలోనే ₹60,116/-ను* వివిధ దాతల ద్వారా సమీకరించడం జరిగింది.

### 💐 *ఆర్థిక సహాయం అందించిన దాతలు*

1️⃣ *ITDA PO శ్రీ బి. రాహుల్ గారు* – ₹60,000/-

2️⃣ *టి. మధుకర్ గారు, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్* – ₹11,116/-

3️⃣ *కుంజా ధర్మా గారు (BJP)* – ₹5,000/-

4️⃣ *తెల్లం రమణయ్య & అనురాధ దంపతులు – BCM* – ₹5,000/-

5️⃣ *కుర్సం ఎర్రయ్య & ఎస్. వెంకటలక్ష్మి దంపతులు, ఖమ్మం* – ₹5,000/-

6️⃣ *ఎం. రామకృష్ణా రెడ్డి గారు – DD Office* – ₹5,000/-

7️⃣ *కొండ్రు వీరస్వామి & కొండ్రు సుధారాణి దంపతులు* – ₹2,000/-

8️⃣ *CH. రమణ మూర్తి గారు, Sr. Asst., DD Office* – ₹2,000/-

9️⃣ *ఇర్పా నారాయణ గారు, Sr. Asst., DD Office* – ₹2,000/-

🔟 *బొర్ర రంగయ్య గారు, Jr. Asst., DD Office* – ₹2,000/-

1️⃣1️⃣ *ఈసం అశోక్ గారు, Jr. Asst.* – ₹1,000/-

1️⃣2️⃣ *గలిగ సురేష్ గారు, Jr. Asst., DD Office* – ₹1,000/-

1️⃣3️⃣ *ఎం. ప్రసాద్ గారు, Jr. Asst., DD Office* – ₹1,000/-

1️⃣4️⃣ *డా. ఎం. వీర నాయక్ గారు, PETC Principal* – ₹1,000/-

1️⃣5️⃣ *కోరస ఉమా మహేశ్వరరావు గారు, టీచర్* – ₹1,000/-

1️⃣6️⃣ *పూనెం కృష్ణ గారు, సర్పంచ్, భద్రాచలం* – ₹1,000/-

1️⃣7️⃣ *పాయం రవివర్మ గారు, Advocate* – ₹1,000/-

1️⃣8️⃣ *భవాని గారు, Superintendent, Engineering Section* – ₹3,000/-

💻 *ఆన్‌లైన్ ద్వారా వివిధ దాతల నుంచి – ₹11,000/-*

🔥 *ముఖ్యంగా, నక్క సంతోష్ MBBS అడ్మిషన్ కోసం అవసరమైన ₹60,000/- సమాజం నుంచి సమీకరించాల్సిన లక్ష్యాన్ని కేవలం ఒక గంటలోనే పూర్తి చేయడం జరిగింది.*

🙏 *ఒక ఆదివాసీ బిడ్డ డాక్టర్ కావాలనే కలకు అండగా నిలిచిన ITDA PO శ్రీ బి. రాహుల్ గారికి, ఆదివాసీ నాయకులకు, ఉద్యోగులకు, దాతలకు మరియు ఆన్‌లైన్ ద్వారా సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.*

*ఈ కార్యక్రమంలో భద్రాచలం కోయ కుల సంఘం పటేల్ తెల్లం రమణయ్య, ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, పూనెం వీరభద్రం, గుండు శరత్, పాయం రవివర్మ, పూనెం నాగేశ్వరరావు, కొండ్రు వీరస్వామి, కొండ్రు సుధారాణి, కణితి రాధ, మిడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు.* 

 

Sunday, September 6, 2026

చర్ల సంతలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ


కాంగ్రెస్ దగాకోరు పరిపాలనలో 6 గ్యారంటీలు 420 ఇచ్చిన హమీలు ప్రభుత్వ వచ్చిన 100 రోజుల్లో నెరవేర్చుతాముఅని చెప్పిన 1000 రోజుల పూర్తి అయిన ఒక్క హమీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు 2 వ తేదీ నుండి 8 తారీఖు వరకు బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు బాగంగా 4 రోజులు నిరసన కార్యక్రమాలు విజయవంతం నిర్వహించడం జరిగింది. 

5 రోజు చర్ల సంతలో కాంగ్రెస్ ప్రజలకు బాకిపడ్డా కార్డులు పంపిణీ చేయడం జరిగింది. సంతలో ప్రజలందరూ మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం మే వస్తుందని చెప్పడం ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంత వెతిరేకత ఉందని చెప్పడానికి నిదర్శనం అని బిఆర్ఎస్ పార్టీ చర్ల మండల కన్వీనర్ తెలియజేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హమీలు అమలు చేయాలని లేని పక్షంలో నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తామని ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు SD అజీజ్ యడ్ల రామదాసు యూత్ నాయకుడు అంబోజి సతీష్ మెంతుల నాగరాజు పాల్గొన్నారు.

Saturday, September 5, 2026

ఘనంగా సన్మానించారు


 తెలంగాణా రాష్ట్రప్రభుత్వ విశ్రాంత  ఉద్యోగుల భవనం లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనం గా జరుపుకున్నారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్రాంత ఉపాధ్యాయులైన ఎన్.ఎస్.అజరయ్య,ఏ.బాలాస్వామి,కె.శేఖర్,పి.సౌదామణి,ఎం.వి.ఎస్.విజయలక్ష్మి ,శోభాకుమారి,ట్.జె.పి.ప్రేమకుమార్,అనసూయ లను శాలువలు,పుష్పగుచ్చాలతో అధ్యక్షులు జి.భూషణరావు ఘనంగా సన్మానించారు.

కార్యదర్శి కె.మధుసూదన రావు,ఫైనాన్స్ సెక్రటరి ఎస్.హనుమంత రావు,అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకన్న,వై.రామచంద్ర రావు,కె.ఎం.కుమారి,జి.తులసీదాస్,టి. పాపయ్య,ఏ.శ్రీనివాసరావు,డి.సుబ్బరాజు,జి.భూపతిరావు,ఎం.భాస్కర్ రావు,రఘురామప్రసాద్,గమానియేల్,అన్నపూర్ణ,కె.మనోహర్,రోడాబాయి,శారమ్మ,రాజు.షమ్షుద్దీన్,అప్పారావు,బ్రమ్మేశ్వరరావు తదితరులు ఫాల్గొన్నారు.

భద్రాద్రిలో బహుముఖ ప్రజ్ఞశాలులకు ఘన సన్మానం

 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో 8 మంది బహుముఖ ప్రజ్ఞాశాలులైన ఉత్తమ ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం  నిర్వహించినట్లుగా మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు తెలిపారు.  

 వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా, ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేసి పలువురు బలహీన బడుగు వర్గాల పిల్లలకు ఆశాజ్యోతి గా నిలిచిన ఉపాధ్యాయులను అన్ని  ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో మండల స్థాయిలో   ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో, శాలువాలు కప్పి, పూల గుచ్చాలు అందించి, మెమెంటోలు ఇచ్చి, మెడల్ ప్రధానం చేసి ఘన సన్మానాన్ని ఘనంగా నిర్వహించారు.

 ఘన సన్మానాన్ని పొందిన మండల స్థాయి *ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...*

బీవీ రత్నకుమారి, SA బైలాజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల భద్రాచలం, కే పుష్ప, SA ఫిజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలికొన్నత  పాఠశాల, భద్రాచలం, పి నాగమణి, SA సోషల్ స్టడీస్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, బి జయబాబు, SA బయోలాజికల్ సైన్స్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, ఎస్ ఎన్ వి  అరుణ కుమారి, SGT, ఎంపీపీ ఎస్ లంబాడి కాలనీ, ఎస్ శ్రీదేవి, SGT, ఎంపీపీ ఎస్ రెవిన్యూ కాలనీ, జి తిరుమల కుమారి, SGT, ఎంపీపీ ఎస్ తాతగుడి  సెంటర్. ఘనంగా సన్మానించి అభినందించారు.

 ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి  బెక్కంటి  శ్రీనివాసరావు మాట్లాడుతూ అవార్డు తీసుకున్న ప్రతి ఉపాధ్యాయుడు మరింత కష్టపడి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో మండల ఫోగ్రామ్  కన్వీనర్ గా పనిచేసిన రాజ శ్రీనివాస్ ప్రసంగిస్తూ మండలంలో కష్టపడి అంకిత భావంతో అన్ని రకాలుగా స్వచ్ఛందంగా పనిచేసిన ఉపాధ్యాయులకు నేడు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం తమకెంతో ఆనందంగా ఉందని వారి సేవలు భవిష్యత్తులో మరింతగా మెరుగుపరుచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఆయన జాన్సన్  మాట్లాడుతూ మండల స్థాయిలో గుణాత్మక విద్యను పెంపొందించడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను గుర్తించి చక్కటి సన్మానం నిర్వహించినందుకు మండల విద్యాశాఖ అధికారి కి అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరూ అంకితభావంతో పనిచేయడం ద్వారా మండలాన్ని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరినారు. 

ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్, పిఆర్టియు  మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జయ బాబు, సన్మాన గ్రహీతలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం ఆర్ సి సిబ్బంది, మండలంలోని ఉన్నత మరియు మండల పరిషత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.