Saturday, September 5, 2026

భద్రాద్రిలో బహుముఖ ప్రజ్ఞశాలులకు ఘన సన్మానం

 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో 8 మంది బహుముఖ ప్రజ్ఞాశాలులైన ఉత్తమ ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం  నిర్వహించినట్లుగా మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు తెలిపారు.  

 వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా, ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేసి పలువురు బలహీన బడుగు వర్గాల పిల్లలకు ఆశాజ్యోతి గా నిలిచిన ఉపాధ్యాయులను అన్ని  ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో మండల స్థాయిలో   ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో, శాలువాలు కప్పి, పూల గుచ్చాలు అందించి, మెమెంటోలు ఇచ్చి, మెడల్ ప్రధానం చేసి ఘన సన్మానాన్ని ఘనంగా నిర్వహించారు.

 ఘన సన్మానాన్ని పొందిన మండల స్థాయి *ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...*

బీవీ రత్నకుమారి, SA బైలాజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల భద్రాచలం, కే పుష్ప, SA ఫిజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలికొన్నత  పాఠశాల, భద్రాచలం, పి నాగమణి, SA సోషల్ స్టడీస్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, బి జయబాబు, SA బయోలాజికల్ సైన్స్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, ఎస్ ఎన్ వి  అరుణ కుమారి, SGT, ఎంపీపీ ఎస్ లంబాడి కాలనీ, ఎస్ శ్రీదేవి, SGT, ఎంపీపీ ఎస్ రెవిన్యూ కాలనీ, జి తిరుమల కుమారి, SGT, ఎంపీపీ ఎస్ తాతగుడి  సెంటర్. ఘనంగా సన్మానించి అభినందించారు.

 ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి  బెక్కంటి  శ్రీనివాసరావు మాట్లాడుతూ అవార్డు తీసుకున్న ప్రతి ఉపాధ్యాయుడు మరింత కష్టపడి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో మండల ఫోగ్రామ్  కన్వీనర్ గా పనిచేసిన రాజ శ్రీనివాస్ ప్రసంగిస్తూ మండలంలో కష్టపడి అంకిత భావంతో అన్ని రకాలుగా స్వచ్ఛందంగా పనిచేసిన ఉపాధ్యాయులకు నేడు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం తమకెంతో ఆనందంగా ఉందని వారి సేవలు భవిష్యత్తులో మరింతగా మెరుగుపరుచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఆయన జాన్సన్  మాట్లాడుతూ మండల స్థాయిలో గుణాత్మక విద్యను పెంపొందించడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను గుర్తించి చక్కటి సన్మానం నిర్వహించినందుకు మండల విద్యాశాఖ అధికారి కి అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరూ అంకితభావంతో పనిచేయడం ద్వారా మండలాన్ని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరినారు. 

ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్, పిఆర్టియు  మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జయ బాబు, సన్మాన గ్రహీతలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం ఆర్ సి సిబ్బంది, మండలంలోని ఉన్నత మరియు మండల పరిషత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Thanks for your visit and comment.