Tuesday, November 3, 2026

కుర్నపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

ఈరోజు చర్ల మండల కుర్నపల్లి  గ్రామ పంచాయతీలో కుర్నపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ నాయకులు కన్నారావ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా నియోజకవర్గం ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ , మానే రామకృష్ణ హాజరైనారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాని అభివృద్ధి చేశారు.

 అదేవిధంగా మోసపూరిత హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తాము అని గద్దె నిక్కి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఒక్క హామికుడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న ఈ  కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి అని దుయ్యబట్టారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో  అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది అని  కెసిఆర్ గారు నిరంతరం రైతుల అభివృద్ధి కోసం గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసారు రైతులకు 24 గంటలు కరెంటు రైతు బంధు రైతు బీమా గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చి వెంటనే రైతు బంధు ఇచ్చిన గొప్ప నాయకుడు, బీద వారికి ఆసరా పెన్షన్లు కళ్యాణ్ లక్ష్మి కెసిఆర్ కిట్టు ఇంటింటికీ మంచినీళ్లు ఇలా అనేక పధకాలు పెట్టి ప్రజలకి సహకరించారు.

 ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతతో పరిపాలన జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో మన కెసిఆర్ గెలిపించుకోవాలని తెలియజేసారు. కుర్నపల్లి యువ నాయకులు కన్నారావ్, బాలకృష్ణ మాట్లాడుతూ ఈ మా గిరిజన గ్రామాల్లో రెండు పంటలు పండటానికి కారకుడు కెసిఆర్ అని, ఈరోజు మా ప్రాంతానికి 3 ఫేస్ కరెంట్ ఇచ్చి ఎల్నిలో వంటి విపత్కర పరిస్థితులను కూడా దైయంగా ఎదుర్కొనేలా చేసి మా ప్రాంత రైతులను రాజును చేశారు అని తెలియజేసారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ మరియు పార్టీ సీనియర్ నాయకులు గొర్ల రాజబాబు, పంజ రాజు, కాకి అనిల్ తడికల బుల్లెబ్బాయి, తుర్రం రాజు, నాగరాజు, క్యాప గణేష్, కాక నరసింహారావు, నక్కరాజు మరియు పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Thanks for your visit and comment.