స్థానిక సరస్వతి శిశు మందిర్ లో విద్యాబోధన మరింత వైజ్ఞానికంగా,విలువలతో కూడిన విద్య ని పిల్లలకి అందించడం కోసం నిపుణులైన విశ్రాంత ఉపాధ్యాయులతో ఇంకా ఇతర నిపుణులతో సమాలోచన జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం లో పలువురు నిపుణులైన ఉపాధ్యాయులు పాఠశాల లో ఉన్న విద్యార్థులతో ముచ్చటించి వారి అవసరాల్ని తెలుసుకున్నారు.అలాగే బోధనా సిబ్బంది కి కూడా పలు సూచనలు ఇచ్చి తమ సహాయ సహకారాల్ని అందించడానికి సుముఖత వ్యక్తపరిచారు.
- ప్రతి సబ్జక్ట్ కి సంభందించి వాటి లోతుపాతులను, ప్రిపేర్ అయ్యే విధానాల్ని తెలియబరిచారు. స్థానిక ఉప ఖజనాధికారి తెల్లం సుభద్ర ఇ కార్యక్రమం లో ఫాల్గొన్న వారిని అందర్నీ అభినందించారు. తమ ఖాళీ సమయం లో విద్యార్థులకి,బోధనా సిబ్బందికి తమ అమూల్యమైన సేవల్ని అందించడానికి ముందుకువచ్చిన వారందరికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత ధన్యవాదాలు తెలిపారు. జి.భూషణ రావు,జి.తులసీ దాస్,జి.వి.సత్యనారాయణ,విజయలక్ష్మి,అనసూయ,రఘురాం ప్రసాద్,జి.రమణ,బందు వెంకటేశ్వర రావు,సుబ్బయ్య చౌదరి,బాలాజీ రాజు,కెవివిఎస్ మూర్తి, ఝాన్సీ రాణి తదితరులు ఫాల్గొన్నారు.


.jpg)

No comments:
Post a Comment
Thanks for your visit and comment.