Friday, September 11, 2026

సుభాష్ నగర్ వాసుల 'ఆశాజ్యోతి' ఎయిడెడ్ స్కూల్

 భద్రాచలం సుభాష్ నగర్ కాలనీలో పనిచేస్తున్న *గోపాలకృష్ణ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల స్కూల్ గ్రామస్తుల ఆశాజ్యోతి* గా నిలుస్తుందని భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ *పూనెం.కృష్ణ* అభిప్రాయం వ్యక్తం చేశారు.

  బలహీన బడుగు వర్గాలకు అభ్యున్నతి కోసం మూడు దశాబ్దాల కాలము నుండి అంకితభావంతో సుభాష్ నగర్ లో *ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఆశాదీపంగా పనిచేస్తుందని వార్డు నెంబర్ గోపి* తెలిపారు.

 ఈ పాఠశాలల *1995 ఒక చిన్న గుడిసెలో* ప్రారంభమైన ఈ పాఠశాల 2022 లో జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది అనంతరం 2023 సంవత్సరము లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఆ *పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయగా అవార్డు స్వీకరించటం ఆమె కృషికి నిదర్శనమని* వార్డు మెంబర్ గోపి హర్షద్వనాల మధ్య ప్రధానోపాధ్యాయుని కృషిని అభినందించారు.

ప్రస్తుతం ఈ పాఠశాలలో చదివే *ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారని* ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని *వేంపాటి ఉషారాణి చెప్పటంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో ఆనందం* వ్యక్తం చేశారు.

*1996 గోదావరి వరదల్లో పాఠశాల మొత్తం శిధిలావస్థకు* చేరి కింద పడిపోవటంతో దిక్కుతోచని స్థితిలో *ఆ కాలనీవాసులు నానాజీ వారిని ఒప్పించి మెప్పించి తాత్కాలిక రేకుల* షెడ్డు నిర్మించి 2020 అదే షెడ్లో పాఠశాలను నిర్వహించారు.

 అనంతరం పలుమార్లు వరదల్లో రేకుల షెడ్డు కూడా ప్రమాదంగా మారటంతో ఎప్పుడు షెడ్డుపడి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందో అని ముందస్తు జాగ్రత్తతో ప్రధానోపాధ్యాయిని *ఐటిసి పేపర్ బోర్డ్ సారపాక వారి సహాయం కోసం పలుమార్లు అభ్యర్థన* చేయటంతో కంపెనీ ప్రతినిధులు సర్వే నిర్వహించి పాఠశాల అవసరాన్ని గుర్తించి *2022 కరస్పాండెంట్, ప్రధాన ఉపాధ్యాయుని సమన్వయంతో పాఠశాల భవన నిర్మాణానికి 20% ఆర్థిక సహాయాన్ని ఐ టి సి కంపెనీకి అందించి నూతన పక్క భవనాన్ని నిర్మించి* పాఠశాల ప్రాంగణం చుట్టూ ప్రహరి గోడ నిర్మాణంతో *జిల్లాలోనే ఒక మోడల్ స్కూల్ మైమరిపించే విధంగా పాఠశాల పనిచేస్తున్నట్లు గ్రామస్తులు నూకా రత్నం* తెలిపారు.

 ప్రస్తుతం ఈ పాఠశాల పక్కా భవనం *పిల్లలందరికీ పక్కా రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్లు,వాష్ బేసిన్* అన్ని రకాల వసతులు ఈ పాఠశాల సొంతం అని వారు అభిప్రాయం తెలియజేశారు.

  *గ్రీన్ భద్రాద్రి వారి సహాయ సహకారాలతో పాఠశాల ప్రాంగణం మొత్తం పెద్దపెద్ద వృక్షాలతో పచ్చని వాతావరణానికి ఈ పాఠశాల కేరాఫ్ అడ్రస్* గా మారింది అని చెప్పక తప్పదు.

 ఈ నేపథ్యంలో ఈ పాఠశాలలో *ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీష్,గణితం అంశాలలో కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించి మౌఖికంగా ఏ లెక్కల అడిగినా టక టక చెప్పి అందర్నీ అబ్బురపరచటం గమనార్హం* అని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 అనంతరం *గ్రామ సర్పంచ్ చేతులమీదుగా విద్యార్థులందరికీ నూతన ఏకరూప దుస్తులు* అందించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అందరి సమక్షంలో ప్రధానోపాధ్యాయని, మండల విద్యాశాఖ అధికారి *పాఠశాలకు విచ్చేసిన గ్రామ సర్పంచ్ పూనెం. కృష్ణను ఘనంగా శాలువాతో సత్కరించారు.*

ఈ కార్యక్రమంలో గ్రామ *సర్పంచ్ పూనెం.కృష్ణ, వార్డు నెంబర్ కావూరి.గోపి,మండల ఏపిఎం, టైలర్ దాసు, పాఠశాల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ, ఎండిఎం నిర్వాహకురాలు నూకరత్నం* తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Thanks for your visit and comment.