Saturday, September 26, 2026

వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధుల మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలం  టి.ఎస్.జి.ఆర్.ఈ.ఏ. ఉద్యోగుల విశ్రాంతి భవనం నందు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా DHEW DMC . సంతోష రూప మాట్లాడుతూ కుటుంబాల్లోని వృద్ధులను గౌరవంగా చూసుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకుండా ప్రేమాభిమానాలతో ఆదరించాలని సూచించారు. వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

వృద్ధులకు ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 14567కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వృద్ధుల హక్కులు, సంక్షేమం, భద్రతపై కుటుంబ సభ్యులు మరియు సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. వయోవృద్దుల సమ్రక్షణకి సంబందించిన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఆ తరువాత టి.ఎస్.జి.ఆర్.ఈ.ఏ. కార్యాలయం లో పేద ప్రజలకి అన్నదానం చేయడం జరిగింది.లోకల్ హాబిటాట్ ఫర్ హ్యూమానిటి సంస్థ వారు దీనికి సహకరించారు. అధ్యక్షులు జి.భూషణ రావు,జాయింట్ సెక్రటరి జి.వి.సత్యనారాయణ,ఉపాధ్యక్షులు వై.రామచంద్ర రావు, రాజేశ్వర రావు తదితరులు ఫాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Thanks for your visit and comment.