Monday, October 5, 2026

ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం (లోడ్) పెంచాలి



పురుషోత్తపట్నం గ్రామంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మరియు రైతులకు ఎదురవుతున్న తీవ్ర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ రైతులందరూ కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్  స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ, "మా గ్రామంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం సరిపోక తరచూ లో-వోల్టేజ్ సమస్యలు రావడం, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోవడం మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల మోటార్లు కాలిపోయి, పంటలకు సమయానికి నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు" అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు నష్టం జరగకుండా, తక్షణమే స్పందించి వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని (లోడ్) పెంచేలా సంబంధిత విద్యుత్ శాఖ(ఏపీ ఎంపీడీసీఎల్)  అధికారులను ఆదేశించాలని జిల్లా కలెక్టర్  కోరారు.

రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు, వెంటనే ఈ విషయంపై విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్ అప్‌గ్రేడేషన్/లోడ్ పెంపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పురుషోత్తపట్నం గ్రామ రైతులు, సారెడ్డి ఏడుకొండలు రెడ్డి, సింగిరెడ్డి గోపిరెడ్డి, భోగాల వెంకటరామిరెడ్డి, గొంగడి వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి ఏడుకొండలు రెడ్డి, చేకూరి రామ్మోహన్రావు  వ్యవసాయదారులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.