చర్ల
ఈరోజు ఎం.పి.పి.ఎస్.,రైస్ పేట కాలనీ లో పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతి గదిని, గౌరవనీయులు మండల విద్యాశాఖ అధికారి పివి రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ , పి.లలిత కుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,బి. శ్రీనివాస్,ఉపాధ్యాయునులు డి.ధనలక్ష్మి,కే.స్వప్న, పూర్వ ప్రాథమిక తరగతి ఇన్స్ట్రక్టర్,పి.సంగీత, పూర్వ పాఠశాల ప్రాథమిక తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు,విజయ కాలనీ గ్రామ వార్డు మెంబర్లు, పి.సమ్మక్క , సంతోష్ , పాఠశాల వంట సిబ్బంది,పాఠశాల స్వచ్ఛ మిత్ర మరియు ఆయా, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సమావేశమును ఉద్దేశించి,చర్ల. మండల విద్యాశాఖ అధికారి రైస్ పేట కాలనీ లో, ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన పూర్వ ప్రాథమిక తరగతిలో, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులను, వార్డు మెంబర్లను కోరారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే ఉచిత విద్యతో పాటు,మధ్యాహ్న భోజనం, మరియు ఉచిత ఏకరూప దుస్తులు, టెక్స్ట్ పుస్తకాలు, నోటు పుస్తకాలు,తదితర ప్రోత్సాహకాలను, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వ పాఠశాలలకు తమ తమ పిల్లలను చేర్పించాలని కోరినారు.
ఏ.ఏ.పీ.సి. చైర్ పర్సన్ శ్రీమతి. పి.లలిత గారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైన వారికి తగిన బహుమతులను అందజేయగలనని ప్రకటించారు. ప్రధానోపాధ్యాయులు, బి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోగలిగామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరుపేరునా, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:
Post a Comment
Thanks for your visit and comment.