అనేక ప్రక్రియల్లో రచనలు చేసి ప్రముఖ రచయిత గా పేరుపొందిన కెవివిఎస్ మూర్తి తన ఇటీవల అనువాద పుస్తకం మిష్మీకొండలు గొప్ప విజయం పొందిన సందర్భం లో వృక్షమిత్ర అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంఘ సేవకులు డా. గోళ్ళ భూపతి రావు దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. తెలంగాణా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం లో ఈ కార్యక్రమం జరిగింది. గతం లో మూర్తి అనువదించిన గాడ్ ఫాదర్ అనే గ్రంథం తెలుగు లో వెలువడి దేశవిదేశాల్లోని తెలుగు పాఠకుల్ని సైతం విశేషం గా అలరించిందని, ప్రస్తుతం తెలుగు లోకి అనువదించిన మిష్మీ కొండలు పుస్తకం ఈశాన్య భారత దేశం లో జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని చిత్రించినదని తెలిపారు. డా.గోళ్ళ భూపతి రావు ఇంకా పుస్తక విశిష్టత ని వివరిస్తూ దీని ఆంగ్లం ఓ రాసిన మూల రచయిత్రి మమాంగ్ డాయ్ ఒక విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారిణి అని చెబుతూ,ఇప్పటికే ప్రముఖ దిన పత్రికల్లో చక్కని రివ్యూలు వచ్చాయని అభినందించారు.

No comments:
Post a Comment
Thanks for your visit and comment.