Tuesday, September 1, 2026

పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలి

సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఉమ్మడి జేఏసీతో కలిసి వినతి పత్రం అందచేసిన  T.S.G.R.EA.యూనిట్ సభ్యులు 

 ది. 01.09.2026 తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా  ప్రకటించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా TSGREA భద్రాచలం యూనిట్ అధ్యక్షులు జి.భూషణ రావు ,కార్యదర్శి కె మధుసూదన్ రావు  మాట్లాడుతూ రెండవ పి ఆర్ సి ని అమలు చేయాలని పెండింగ్లో ఉన్న ఆరు డిఏ బకాయిని విడుదల చేయాలని ఓపిఎస్ ని కొనసాగించాలని సిపిఎస్ ని రద్దు చేయాలని ఆర్డిఏ, పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలు విడుదల చేయాలని పెన్షనర్ల హెల్త్ కార్డుకు సంబంధించి మార్గదర్శకాలు పక్కాగా రూపొందించి వారికి కార్డు అందించాలని  పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఉమ్మడి JAC తో కలిసి భద్రాచలం సభ కలెక్టర్ వారికి వినతిపత్రం సమర్పించడం జరిగినది.

 ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వై. రామచంద్రరావు  అసోసియేట్ ప్రెసిడెంట్ జి.వెంకన్న, జి వి సత్యనారాయణ,ఎస్ హనుమంతరావు సిహెచ్  నరసింహం, ఏ శ్రీనివాసరావు,రఘురాం ప్రసాద్, పాపయ్య,కృష్ణారావు, సూరిబాబు, అప్పారావు బ్రహ్మేశ్వర రావు, ఏసుదాసు ఆదినారాయణ, కే శేఖరు గమనేయులు,వెంకటేశ్వరవు రామలింగం,రోడబాయి,సౌదామని,సారమ్మ, వజ్రమని రోజామని తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.