Tuesday, September 1, 2026

భద్రాచలం నాయి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీకి బీజేపీ ఓబీసీ మోర్చా ఘన సన్మానం

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ సభ్యులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్‌లో ఘన సన్మానం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, పీసీ కేశవ్, జిల్లా కోశాధికారి గుమ్మల వెంకటేశ్వర్లు (జీవా) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జతంగి కృష్ణ మాట్లాడుతూ, ఓబీసీల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 

నాయి బ్రాహ్మణులు ప్రతి కుటుంబంలో శుభకార్యాల నుంచి సామాజిక అవసరాల వరకు, సమాజానికి తరతరాలుగా అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వారి వృత్తికి గౌరవం, గుర్తింపుతో పాటు సంక్షేమం కోసం బీజేపీ ఓబీసీ మోర్చా అండగా నిలుస్తుందని తెలిపారు. నూతన కమిటీ ఐక్యత, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

సన్మానం పొందిన వారిలో: నాయి బ్రాహ్మణ సంఘం భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ జంపాల ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి సోమనపల్లి నాగేశ్వరరావు, జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలకంటి రఘునాథబాబు, జిల్లా సహకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాజి కుమారస్వామి, సంఘం సభ్యులు మార్కాపురం సీతారాములు, అడ్డగూడూరు సత్యనారాయణ, ఎ. రవికుమార్, మల్యాల శ్రీనివాస్, కొండ్రు వెంకటేశ్వర్లు, ఎ. శ్రీకాంత్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, ముత్యాల శ్రీనివాస్, ములిశెట్టి రాంమోహన్ రావు, చెల్లుబోయిన వెంకన్న, బోడ సత్యనారాయణ, అల్లాడి వెంకట సుబ్బారావు, రామాచారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.