Tuesday, September 1, 2026

వేద పాఠశాలను తలపిస్తున్న తాత గుడి సెంటర్ ప్రాథమిక పాఠశాల..


 భద్రాచలం తాత గుడి సెంటర్లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణములోనే  ఒకవైపు ప్రాథమిక విద్య మరోక వైపు పూర్వ ప్రాథమిక విద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను చూస్తే అలనాడు అంకిత భావంతో  గ్రామాలకు దూరంగా నిర్వహించిన వేద పాఠశాలను తలపిస్తున్నాయని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం నాడు ఆర్కస్మికంగా ఈ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సందర్శించారు.  ఈ పాఠశాల  ప్రాథమిక స్థాయిలో 149 మంది విద్యార్థులు పూర్వ ప్రాథమిక కేంద్రంలో 20 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

 ఈ పాఠశాలలో ప్రతిరోజు ఎక్సెల్ ప్రోగ్రాం కింద విద్యార్థులు కంప్యూటర్లను వినియోగించుకొని ఆధునిక జ్ఞానాన్ని నేర్చుకోవటం వాటిలోని మెలుకువలను అలవర్చుకొని  వినియోగించుకోవడం  అందరికీ ఆదర్శమని  బెక్కంటి అన్నారు.


 ఈ నేపథ్యంలో బ్యాగ్ లెస్ డే రోజు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలను నిర్వహించడం ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయటం  ఒక ప్రత్యేకత సంతరించుకుంది.

 ఇదిలా ఉండగా పూర్వ ప్రాథమిక విద్యలో విద్యార్థులను అంతర్గత సామర్థ్యాలను వెలుగుచూస్తూ పక్కనే ఉన్న ప్రాథమిక విద్యను పరిచయం చేస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించటం తద్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు తరగతి గదిలో కనీస అభ్యసన సామర్ధ్యాలను సాధించని పిల్లలకు  ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలోని సామర్థ్యాలను అభివృద్ధి పదములో తీసుకురావడం ఈ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం.

 ఒకే ప్రాంగణంలో ఒక పక్క పూర్వ ప్రాథమిక విద్య మరొక పక్క ప్రాథమిక విద్య అనుసంధానం చేసి విద్యార్థులకు తరగతి గదిలో కావలసిన కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించటం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 గ్రామ నడిబడ్డనున్నప్పటికీ పచ్చని వాతావరణంలో చక్కటి విద్యకు శ్రీకారం చుట్టిన పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

 ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపారావు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిరీష్య సేవలను వారు కొనియాడారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు యోగ, ఆటల పోటీలలో అవగాహన కలిగించటం నైపుణ్యాలను పెంచడం దిన చర్యలో భాగంగా నిర్ణయించటం ఈ పాఠశాల ప్రత్యేకత.

 ఈ కార్యక్రమంలో వీరి వెంట క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ తోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,స్వచ్ఛ మిత్రా సేవకులు,మధ్యాహ్న భోజన నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.