భద్రాచలం పట్టణంలో రంగనాయకుల గుట్టపై ఉన్న ప్రాథమిక పాఠశాల పచ్చని వాతావరణంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు.
ఎవరైనా ఒక్కసారి ఈ పాఠశాల ఆవరణకు వచ్చారంటే అద్భుతమైన వాతావరణాన్ని వారు చవిచూడాల్సిందే అని బెక్కంటి అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిత్యం పిల్లలకు అందుబాటులో *అనుభవజ్ఞులైన అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులచే కృత్యాధార బోధనోపకరణాల వినియోగము, విద్యార్థి కేంద్రం బోధనతో పాటు వసతులు ఎవరు ఊహించని విధంగా ఉన్నాయని కాబట్టి ఈ పాఠశాలలో చదవటం పిల్లలకు ఒక అదృష్టమని* దానిని అర్థం చేసుకొని ఈ ప్రాంత తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఈ పాఠశాలల సందర్శించి మీ పిల్లల్ని అందరిని ఈ పాఠశాలలో నమోదు చేయవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మండల *విద్యాశాఖ అధికారి విద్యార్థిలతో ముఖాముఖి నిర్వహించి* అనంతరం విద్యార్థుల్లోని అంతర్గత సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.
నేపథ్యంలో పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ మరింత ప్రతిష్టంగా అమలు చేసి గుణాత్మకమైన విద్యాసాధనకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
అదేవిధంగా విద్యార్థులకు *గ్రంథాలయ నిర్వహణ, ఆటలు అందుబాటులో ఉండే విధంగా కృషి* చేయాలని ఉపాధ్యాయులను కోరారు.
ఇది ఇలా ఉండగా పచ్చని పాఠశాల వాతావరణంలో చక్కని *కిచెన్ గార్డెన్ నిర్వహణ నిర్వహణ* పట్ల మండల విద్యాశాఖ అధికారి సంతృప్తి వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి తో పాటు *సిఆర్పి గోపికృష్ణ ఉపాధ్యాయులు కృష్ణ, విజయ్, స్వచ్ఛ మిత్ర సేవకులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు* తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment
Thanks for your visit and comment.