కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల దగా పాలనపై కెటిఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుండి 8 వరకు బిఆర్ యస్ పార్టీ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు 420 హమీలు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో హమీలు నెరవేర్చుతాముఅని చెప్పిన ప్రభుత్వం 1,000 రోజులు అయినా ఒక్క హమీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. అంతే కాకుండా కెసిఆర్ బీద ప్రజలకు కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి షాదిముబారాక్ కెసిఆర్ కిట్టు రైతు భీమా పధకాలను నిలిపివేయడం వాటిని వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హమీలు అమలు చేయాలని ప్రతీ సంవత్సరం రైతు భరోసా కౌలు రైతులకు 15 వేలు ఆసరా పెన్షన్లు 4 వేలు వికలాంగులకు 6 వేలు 500 లకే గ్యాస్ తులం బంగారం ప్రతీ మహిళకు 2500 రూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ జాబ్ క్యాలెండర్ యూత్ డిక్లరేషన్ నిరుద్యోగ బృతివిద్యార్థినులకు స్కూటీలు విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్ పోటి పరీక్షలకు ఫీజులు రద్దు ప్రతీ ఆటోడ్రైవలకు 12 వేలు వ్యవసాయ కూలీలకు 12 వేలు ఉద్యమకారులకు250 చదరపు గజాల ఇంటి స్థలాలు జర్నలిస్టులకు 1,00 కోట్లుతో సంక్షేమ నిధి అనేక హామీలు ఇచ్చి అమలు చేయని ఈ ప్రభుత్వం పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు సర్పంచులు వార్డు మెంబర్లలు కెసిఆర్ అభిమానులు ఈ 7 రోజులు ప్రతీ రోజు నిరసనలు ధర్నాలు గ్యారంటీ కార్డులు పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు పరిపాలన గురించి అవినీతి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి 10 వ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిజేయాలని తెలిపారు

No comments:
Post a Comment
Thanks for your visit and comment.