ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్ర్య ఫలాల్ని అందరికీ అందేలా ప్రతి పౌరుడు తన విధిని చిత్తశుద్ధి తో నిర్వర్తించాలని,చారిత్రక ఘటనల్ని వివరిస్తూ దేశభక్తుల జీవితాల్ని సోదాహరణం గా వివరిస్తూ నాటి వారి త్యాగాల్ని మరిచిపోరాదని తెలంగాణా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు జి.భూషణం పిలుపునిచ్చారు. పంద్రాగస్టు ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణం లో జాతీయపతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఫాల్గొన్నారు. ప్రధాన కార్యదార్శి కె.మధుసూదన్ రావు,అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకన్న,మీడియా కార్యదర్శి గాదె తులసీ దాస్ ఇంకా ఇతరులు మాట్లాడారు.


No comments:
Post a Comment
Thanks for your visit and comment.