Monday, August 24, 2026

విశ్వవిద్యాలయాన్ని మరిపిస్తున్న భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల

 


 భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోని వసతులు గాని విద్యార్థులు క్రమశిక్షణ గాని తరగతులను నిర్వహణ గాని ఉపాధ్యాయుల బోధన గాని కంప్యూటర్, గణితము, సైన్స్ ల్యాబ్  నిర్వహణ  గాని మరుగుదొడ్ల నిర్వహణ గాని  విశ్వవిద్యాలయాన్ని  మైమరిపిస్తుందని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సోమవారం నాడు ప్రార్ధన సమయంలో పాల్గొని కొద్దిసేపు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం ప్రార్థన కన్నా ముందే విద్యార్థులు పాఠశాలలకు హాజరై పాఠశాలలోని నిన్న ఉపాధ్యాయలు ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేయటం గమనార్హం. 

ఈ నేపథ్యంలో అన్ని తరగతి గదులు వసతులను స్వయంగా ఆయన పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ మాట్లాడి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు.

 పాఠశాలలో హరితహారం, పరిశుభ్రత పచ్చదనం చూడముచ్చటగా ఉందని స్వయంగా విద్యార్థి కేంద్రంగా తరగతి గది బోధనా తో పాటు కిచెన్ గార్డెన్ నిర్వహణ నిర్వహించడం ప్రధాన ఉపాధ్యాయిని కృషికి నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సుమారు 475 మంది పిల్లలు ఉన్నప్పటికీ నిశ్శబ్ద వాతావరణంలో పాఠశాల ఉండటం ఉదయం పిల్లలు ప్రార్థన కన్నా ముందే వచ్చి వారి వారి తరగతి గదిలో వారి ఇంటి పనిని పూర్తి చేసుకోవటం , క్రమశిక్షణతో ఉండటం,నిశ్శబ్దత పాటించటం   చూపరాలను  సైతం ఆకట్టుకుంటుంది.

 ఇక్కడ పనిచేసే సిబ్బంది ఉపాధ్యాయులు అంకితభావం వారి సమిష్టి కృషికి నిదర్శనమని,ఈ పాఠశాల పనితీరు లో ప్రతి   ఉపాధ్యాయుడు నిరంతర కృషిని ప్రతి ఒక్కరు  ఆదర్శంగా తీసుకోవాలని ,గుర్తించాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.