Monday, October 19, 2026

సేవాశ్రమం ప్రారంభోత్సవం

భద్రాచలం పట్టణంలోని కొత్త ఎల్‌ఐసి కార్యాలయం ఎదురుగా, కర్ర డిపో వద్ద వృద్ధులు, అనాథలు, దివ్యాంగుల సేవే లక్ష్యంగా నిర్మిస్తున్న ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా PYFSS  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. సమాజంలో ఆదరణకు నోచుకోని వృద్ధులు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రయం కల్పించడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, అవసరమైన వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

మానవత్వం, సేవాభావంతో ముందుకు సాగుతూ సమాజంలోని నిరుపేదలు, అభాగ్యులకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Thanks for your visit and comment.