ఈరోజు స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం భద్రాచలం నందు మండల విద్యాధికారి బెక్కంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా హాజరైన ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉద్దేశించి మండల విద్యాధికారి మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమంలో మండలంలో పాఠశాలల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న 8 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సన్మానిస్తామని దానికి అన్ని సంఘాల సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల బాధ్యులు టి రామకృష్ణ, బి కృష్ణ, టీఎస్ యుటిఎఫ్ బాధ్యులు ఎస్ విజయ్ కుమార్, కే శ్రీనివాసరావు, పి ఎస్ వి ప్రసాద్ బాబు, ఆట సంఘ నాయకులు కలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Thanks for your visit and comment.