Thursday, September 3, 2026

రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం

ఈరోజు కెటిఆర్ ఆదేశాల మేరకు రైతు సమస్యలపై కొత్తపల్లి గ్రామంలో రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆరోపించారు  రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు మరింత పెరిగాయని విమర్శించారు.

రైతు రాజ్యం వస్తుందని ఆశిస్తే రావణ రాజ్యం వచ్చింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు

రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు

రైతు బీమా పథకాన్ని ఎత్తివేసారని  రుణమాఫీ అసంపూర్తి గా చేశారన్నారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన రైతు బీమా వంటి పథకాలు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాయని అన్నారు. 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు అదే విధంగా రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.

 ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

  పండించిన పంటకు గిట్టుబాటు ధర,సన్న వడ్లకు రూ.500 బోనస్,కౌలు రైతులకు రైతు భరోసా వంటి హామీలు ఇచ్చినా వాటి అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు

*కౌలు రైతులకు ఇస్తామన్న భరోసా ఏదని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆ హామీ అమలు పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు* 

*ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిర్లక్ష్యం

రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని బీఆర్‌ఎస్ నాయకుడు ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడుతున్నారని,సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి చివరకు ఒక సీజన్ కు మాత్రమే పరిమితం చేశారని, దాన్ని ఈ సంవత్సరం ఏడు రకాల వడ్ల ను సాగు చేసిన వారికే అంటూ బోనస్‌ను బోగస్‌గా మార్చారని విమర్శించారు.

యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారనిప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని  అన్నారు.

పంటల సాగు కీలక దశలో ఎరువులు సకాలంలో అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు

యూరియా కోసం యాపులు పెట్టిన రాబందు ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో, సరిపడా అందించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ కొత్తపల్లి సర్పంచ్ ఉప్పట్ల నాగలక్ష్మి మొగల్లపల్లి ఉపసర్పంచ్ ఎడ్ల రామదాసు నియోజకవర్గ యువజన నాయకులు కాకి అనిల్ పంజా రాజు  మండల మండల నాయకులు సయ్యద్ అజీజ్ బట్ట కొమరయ్య రాట్నాల శ్రీరామ్మూర్తి  యూత్ అధ్యక్ష కార్యదర్శులు అంబోజి సతీష్ కుప్పల నిరంజన్ BC సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు SC సెల్ అధ్యక్షులు కొంబతీని రాము యువజన నాయకులు తడికల బుల్లేబాయ్ గదేంశెట్టి కిశోర్ కుక్కడపు సాయి మైప వెంకటేశ్వర్లు సాంబ  నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,రైతులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment

Thanks for your visit and comment.