భద్రాచలం,ఆగస్టు 13 : భద్రాచలం పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే మహోన్నత లక్ష్యంతో స్థాపించబడిన డా.పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీ మరోసారి పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జేఎన్‌టీయూ హైదరాబాద్ అనుబంధంలో తొలి క్రిస్టియన్ మైనారిటీ ఇంజనీరింగ్ విద్యాసంస్థగా పేరొందిన ఈ కళాశాల వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దింది.ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశ, విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉన్నత పదవుల్లో స్థిరపడి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.
ప్రస్తుతం జేఎన్‌టీయూ కాకినాడ అనుబంధంలో భద్రాచలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న ఈ కళాశాలలో నూతన యాజమాన్యం బాధ్యతలు స్వీకరించింది. అర్హత కలిగిన ప్రొఫెసర్లు, ఆధునిక ల్యాబొరేటరీలు, బాలురు–బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, మెరుగైన మౌలిక వసతులతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది.విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకే మేనేజ్‌మెంట్ సీట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది అలాగే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ అనే భేదం లేకుండా దేశంలోని ఏ జిల్లా, ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా ఈ కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చని యాజమాన్యం స్పష్టం చేసింది ప్రస్తుతం బీటెక్ (B.Tech) ఎం.టెక్ *(M.Tech)*డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు
📞 98483 69806 సంప్రంచగలరు.

No comments:
Post a Comment
Thanks for your visit and comment.